Social 1080×1350 • Multi-page
17-07-2024 BREAKING NEWS 02:29 AM
swarnodayam.com
Telugu Daily News

కారంచేడు మృత వీరులకు ఎమ్మార్పీఎస్ నేతల జోహార్లు

కారంచేడు మృత వీరులకు ఎమ్మార్పీఎస్ నేతల జోహార్లు
IMG-20240717-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో 1985 జూలై 17 న భూస్వామ్య వర్గాల వారు మాదిగ పల్లె పైన జరిగిన అమానుష సంఘటనకు నిరసనగా హుజురాబాద్ లోనీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర బుధవారం ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రo మాట్లాడుతూ కారంచేడు గ్రామంలో మాదిగలు మంచినీరు త్రాగే చెరువులో పశువులను కడిగి నీటిని కలుషితం చేసిన క్రమంలో మున్నంగి సువార్త,కత్తి చంద్రయ్య ఇద్దరూ అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనిపై ఆగ్రహించిన కమ్మ భూస్వామ్య వర్గాల పెద్దలు తెల్లవారుజామున మాదిగ పల్లె పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు.ఈ దాడిలో ఏడుగురు చనిపోయారనీ, అనేకమంది గాయపడ్డారన్నారు. దీనికి వ్యతిరేకంగా దళిత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి దోషులకు శిక్ష పడేలా చేసిందనీ గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం దిగి వచ్చేలా చేసిందనీ, వివిధ ప్రజాసంఘాల మద్దతు లభించిందన్నారు. కావున దళితులందరూ ఐక్యంగా ఉండి ఇటువంటి దాడులను ఎదుర్కోవాలని రామచంద్రం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం, వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, రాం రాజేశ్వర్, ఇల్లoదుల సమ్మయ్య, తునికి సమ్మయ్య, ఆడేపు సురేందర్, బత్తుల రాజలింగం, వేల్పుల భాస్కర్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్ , మోరే సతీష్, వేల్పుల ప్రభాకర్, అంబాల రవీందర్, బొడ్డు ఐలయ్య, ముక్క మొగిలి, రుద్రారపు మొగిలి, ఏనుగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!