Social 1080×1350 • Multi-page
17-07-2024 BREAKING NEWS 06:58 AM
swarnodayam.com
Telugu Daily News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వోడితల ప్రణవ్.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వోడితల ప్రణవ్.
IMG-20240717-WA0112

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు, రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారనీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ మానిటర్ ద్వారా రైతులు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించేలాగా వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనీ తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమము విజయవంత చేసేందుకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశామన్నారు. రైతు ఉత్సవాల సంబరాలలో భాగంగా రైతులకు కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేస్తారనీ, హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతు వేదికలకు వచ్చిన రైతులతో రుణమాఫీ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా తాను కూడా పాల్గొంటానని వోడితల ప్రణవ్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!