Social 1080×1350 • Multi-page
17-07-2024 BREAKING NEWS 09:36 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా యాదవుల బీరన్న బోనాలు

హుజురాబాద్ లో ఘనంగా యాదవుల బీరన్న బోనాలు
IMG-20240717-WA0126

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పట్టణంలో యాదవ సంఘం అధ్యక్షుడు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక గొల్లవాడ నుండి యాదవులు పెద్ద ఎత్తున ర్యాలీతో సిర్సపల్లి ఎక్స్ రోడ్ లో గల బిరన్న దేవాలయంలో బోనాలను సమర్పించారు. ఇంటి వద్ద బోనాలను పూజించుకొని మేళతారాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయం వద్దకు చేరుకొని మొక్కలు చెల్లించుకున్నారు. పిల్లాపాపలతో, గొడ్డు గోదాతో అందరూ క్షేమంగా ఉండేలా చూడాలని బీరన్న దేవున్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డ్ కౌన్సిలర్ మక్కపెళ్లి కుమార్ స్వామి, కుల పెద్దలు భాషబోయిన రాజకొమురయ్య, భాష బోయిన సదానందం, తొర్రి సమ్మయ్య, గండ్రకోట సారయ్య, భాష బోయిన ఓదెలు, సింగరేణి సమ్మయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!