Social 1080×1350 • Multi-page
18-07-2024 BREAKING NEWS 02:00 AM
swarnodayam.com
Telugu Daily News

రుణమాఫీని ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం..! రుణమాఫీ ఫై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్:

రుణమాఫీని ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం..! రుణమాఫీ ఫై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్:
IMG-20240718-WA0078

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు అన్ కండిషనల్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పావో అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు అని ఎంపీ, బిజెపి సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిఉండగా ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందన్నారు. ఇవ్వాలున్నటువంటి ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి, రైతులను రుణవిముక్తులను చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఈటెల చెప్పారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!