Social 1080×1350 • Multi-page
18-07-2024 BREAKING NEWS 08:16 AM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ లో ఆకట్టుకున్న చిన్నారుల హౌజ్ పోలింగ్!

ఆల్ఫోర్స్ లో ఆకట్టుకున్న చిన్నారుల హౌజ్ పోలింగ్!
IMG-20240718-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం హౌజ్ పోలింగ్ నిర్వహించగా పలువురుని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో తరగతి గదులను వివిధ హౌజ్ లుగా విభజించారు. ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థులకు కేటాయించిన గుర్తుల గురించి హౌజ్ లకు వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరైన అల్ఫోర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్ చైర్మన్‌ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ప్రగతికి ఎన్నికలే కీలకమని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విధ్యార్దుల కృషి ఎంతగానో అవసరం అన్నారు. విద్యార్థుల్లో భారతీయ ఎన్నికల విధానం గురించి అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ఓటు హక్కు ప్రాధాన్యం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బ్బందం పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!