Social 1080×1350 • Multi-page
18-07-2024 BREAKING NEWS 01:19 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలో రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.- టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ వెల్లడి.

తెలంగాణలో రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.- టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ వెల్లడి.
IMG-20240718-WA0104

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిథి, హుజూరాబాద్ : తెలంగాణలో రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ వెల్లడించారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల చూపిస్తున్న ప్రేమను తెలంగాణలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రైతు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని టిపిసిసి ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు. ఇవాళ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతు అప్పు తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. వ్యవసాయం దండగని చెప్పిన వారికి ఇవాళ ప్రతి పల్లెలో పండగ వాతావరణం నెలకొందనీ, ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో శ్రీరాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పారపు భువన చంద్ర, ఎర్ర కుమార్, రొంటాల లింగయ్య, బత్తుల రాజలింగం, ప్రజాసంఘాల నాయకులు అరుకుటి విష్ణు, శాలపల్లి ఇందిరానగర్ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!