Social 1080×1350 • Multi-page
19-07-2024 BREAKING NEWS 04:33 AM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ లో ఘనంగా బోనాల వేడుకలు.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ బోనాలు ఆల్ఫోర్స్ స్కూల్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి.

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ లో ఘనంగా బోనాల వేడుకలు.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ బోనాలు ఆల్ఫోర్స్ స్కూల్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి.
IMG-20240719-WA0136

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ హుజూరాబాద్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ స్కూల్స్ చైర్మన్ డా.వి నరేందర్ రెడ్డి పాల్గోని బోనాల ప్రత్యేకతను విద్యార్ధులకు తెలియజేసారు. ఆషాడమాసంలో బోనాల ఉత్సవాలను జరుపుకుంటారన్నారు. భోనం అనగా భోజనం అని అర్ధంమని, ఆషాడ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళతారనీ, అమ్మవారిని భోనంతో ఎదుర్కొని ఓడి బియ్యం, చీరే, సారెలను అమ్మ వారికి అందించి పూజిస్తారన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా తమ సంస్కృతి ఆచార సంప్రదాయాలను గురించి తెలుసుకోవాలని చైర్మన్ నరేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెడ్ డే వేడుకల్లో పాల్గొని చిన్నారులు అద్భుత ప్రసంగం చేశారు. నిన్న జరిగిన హౌజు ఎలక్షన్స్ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తో పాటు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!