20-07-2024 NORMAL NEWS 07:21 AM
swarnodayam.com
Telugu Daily News
20-07-2024 07:21 AM By Mandala Yadagiri

క్షేత్ర పర్యటనకు వెళ్లిన శాతవాహన విద్యార్థులు

క్షేత్ర పర్యటనకు వెళ్లిన శాతవాహన విద్యార్థులు
IMG-20240720-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన పాఠశాల, ఆదర్శ విద్యాలయం విద్యార్థులు శనివారం క్షేత్ర పర్యటనకు వెళ్లారు. వ్యవసాయం, సాగు మొదలైన విషయాలను తెలుసుకోవడానికి విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి క్షేత్ర పర్యటనకు వెళ్లి అక్కడ రైతులతో ముచ్చటించారు. నారు వేయడం, దున్నడం, కలుపు తీయడం, పురుగుల మందు కొట్టడం ఇతర సాగు విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా వారిలో నూతన విధానాల పట్ల అవగాహన పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వి వెంకటేశ్వర్లు, ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్ పి కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు సతీష్, రాజయ్య, షహీన్, సరిత తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!