Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 04:47 AM
swarnodayam.com
Telugu Daily News

వర్షాలకు స్విమ్మింగ్ ఫుల్ లాగా మారిన హుజురాబాద్ లోని 23 వ వార్డు బుడిగ జంగం కాలనీ.. వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్న వృద్ధులు, పిల్లలు..

వర్షాలకు స్విమ్మింగ్ ఫుల్ లాగా మారిన హుజురాబాద్ లోని 23 వ వార్డు బుడిగ జంగం కాలనీ.. వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్న వృద్ధులు, పిల్లలు..
IMG-20240721-WA0108

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఏడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుజూరాబాద్ పట్టణంలోని 23వ వార్డులో గల బుడగజంగం కాలనీ స్విమ్మింగ్ ఫుల్ లాగా మారింది. హుజురాబాద్ లోని 23 వ వార్డు బుడిగ జంగం కాలనీలో ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు స్కూల్ కు వెళ్లలేని పరిస్థితి. పాములు, తేళ్లతో చాలా ఇబ్బంది. ఇంట్లోకి వరద నీరు వచ్చి వంట చేసుకోలేని పరిస్థితి. రోడ్లు గాని డ్రైనేజీ కాలువలు వీధి స్తంభాలు సరిగ్గా లేక నాన ఇబ్బందికి గురవుతున్నామని, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మా బతుకులు మారుతలేవని మమ్మల్ని ఆదుకోవాలని బుడిగ జంగం కాలనీవాసులు వేడుకుంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడగ జంగం కాలనీలోని గుడిసెలు పూర్తిగా నీట మునిగి కనీసం పడుకోవడానికి చోటు లేక ఉండడానికి గూడు లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బల్దీయా పాలకవర్గం గానీ స్థానిక నాయకులు గానీ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బల్దియా, రెవెన్యూ అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. నీట మునిగిన బుడగ జంగం కాలనీ బిజెపి నాయకులు, కుల పెద్దలు సందర్శించి పరిశీలించారు. వారికి ధైర్యాన్ని అందించారు. సందర్శించిన వారిలో తూర్పాటి రాజు, తూర్పాటి సమ్మయ్య, తుర్పాటి రామచంద్రం, పర్థం రాము, పర్థం సాయి, తూర్పాటి అనిల్, మోటం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!