Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 10:22 AM
swarnodayam.com
Telugu Daily News

వర్షంలో సైతం కార్యకర్తల ఇంటికి వెళ్లి బీమా చెక్కులను అందించిన ఎమ్మెల్యే..!కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

వర్షంలో సైతం కార్యకర్తల ఇంటికి వెళ్లి బీమా చెక్కులను అందించిన ఎమ్మెల్యే..!కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
IMG-20240721-WA0167

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వర్షంలో సైతం కార్యకర్తల ఇంటికి వెళ్లి పార్టీ అందించిన బీమా చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందించి తన ఉదాహరణ చాటుకున్నారు. ఇటీవల అభాది జమ్మికుంట, వావిలాల గ్రామాలలో ప్రమాదవశాత్తు మరణించిన బండి రాజశేఖర్ మరియు కొమ్ము కొమురయ్య కుటుంబాలాకు అండగా బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల రూపాయల విలువ గల చెక్కులను మంజూరు చేయగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్షంలో నేరుగా వారి ఇంటి వద్దకే వెల్లి చెక్కులను అందజేశారు. ఎల్లాప్పుడూ పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఅరెస్ అని, కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామనీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుమళ్ళ సురేందర్ రెడ్డి, వర్ధినేని రవీందర్ రావు తదితరులున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!