Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 10:48 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ సొంతగూటికి చేరిన స్వర్గం రవి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం

కాంగ్రెస్ సొంతగూటికి చేరిన స్వర్గం రవి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం
IMG-20240721-WA0189

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ నాయకత్వంలో మంత్రి పొన్నం సమక్షంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామనికి చెందిన ప్రముఖ పారిశ్రామికమేత స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు హైద్రాబాద్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వర్గం రవి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నావాడే. ఉప ఎన్నికల కాలంలో బిఆర్ఎస్ పార్టీకి వెళ్లారు. మళ్లీ సొంత కాంగ్రెస్ పార్టీపై ఉన్న మమకారంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన ఉత్తేజం తీసుకుని వస్తున్న
వోడితల ప్రణవ్ నాయకత్వంలో ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన స్వర్గం రవి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తన వంతు సహాయంగా సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. స్వర్గం రవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కమలాపూర్ మండలములో కాంగ్రెస్ పార్టీకి పూరవైభం రానుంది. స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్గం రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తాను తిరిగి సొంతగూటికి రావడం జరిగిందని, నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!