Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 12:59 PM
swarnodayam.com
Telugu Daily News

షిరిడిసాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణిమ వేడుకలు

షిరిడిసాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణిమ వేడుకలు
IMG-20240721-WA0095

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సర్వమతతీత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, రుత్వికరణము, అఖండ దీపారాధన, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పూజ, సాయిబాబా వారికి పంచామృత స్నానం, పంచసూక్తి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారన్నారు. ఈ వేడుకలు ఆలయ సంస్థ ట్రస్ట్ చైర్మన్ వెంపటి సదానందం, ఆలయ కమిటీ మరియు అర్చకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!