Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 11:44 PM
swarnodayam.com
Telugu Daily News

దాశరధి జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటిన వాకర్స్

దాశరధి జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటిన వాకర్స్
IMG-20240722-WA0054

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిన తెలంగాణ అస్తిత్వం దాశరథి కృష్ణమాచార్య అని వారికి శత జయంతి సందర్భంగా హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు ఘన నివాళులు అర్పించి ఈ సందర్భంగా హుజురాబాద్ హైస్కూల్ క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. వారి కవిత్వాలు, రచనలు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

దాశరథి తన కలం నుండి తెలంగాణ కోట్లాది గొంతుకల పోరాట ధ్వనిని తన కవిత్వ మైక్ గా మార్చి నిజాం రాజు జన్మజన్మల బూజు అంటూ అగ్నిధారలు కురిపించారన్నారు. అనాదిగా సాగుతుంది అనంతుడి సంగ్రామం, అనాధుడికి ఆగర్భ శ్రీనాథుడికి అంటూ తెలంగాణ విముక్తి సాయుధ పోరాట కార్యాచరణలో పాలుపంచుకున్నారన్నారు. నేను తెలంగాణ బానిస సంకెళ్లు తెంపడానికి వెళ్తున్నాను నా వెంట రండి అంటూ దాశరథి తన నిబద్ధతను చాటుకున్నారనీ గుర్తు చేశారు. దాశరథి ఓ వైపు విప్లవాగ్నులను రగుల్చుతూనే సినీగీతాలను వెలివరించారని ఆయన సాహిత్యం ఉద్యమ పోరాటానికి స్ఫూర్తి అని వాకర్స్ అసోసియేషన్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ పిడి కొన్నే రాజిరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వేల్పుల రత్నం, సాదుల రవీందర్ బాబు, బొడిగ మల్లయ్య, మక్కపల్లి రమేష్, తిరుణహరి రమేష్ కుమార్, బండ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!