Social 1080×1350 • Multi-page
22-07-2024 BREAKING NEWS 09:22 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
IMG-20240722-WA0189

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం హుజురాబాద్ పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. వినోద్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, చైర్ పర్సన్ గంధ రాధిక, కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు, ముక్క రమేష్ కల్లేపల్లి రమాదేవి, కుమారస్వామి, గందె శ్రీనివాస్ ఇమ్రాన్ నరసింహారెడ్డి, కోయేడ శ్రీదేవి, కమలాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. కాగా కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి జన్మదిన వేడుకలు సైతం ఎంతో ఘనంగా నిర్వహించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!