Social 1080×1350 • Multi-page
22-07-2024 BREAKING NEWS 11:07 PM
swarnodayam.com
Telugu Daily News

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇంటికే మద్యం

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇంటికే మద్యం
IMG-20240723-WA0067

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ లిక్కర్ కోసం ఇక పై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను సైతం హోమ్ డెలివరీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు యోచిస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్ లో అమల్లో ఉండగా త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హరియాణా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ వంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని పేర్కొన్నది. ఈ విధానం ద్వారా లాభనష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతున్నది. ఏది ఏమైనా హోమ్ డెలివరీ వచ్చేసిందంటే మద్యం ప్రియులకు పండగే పండుగ.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!