Social 1080×1350 • Multi-page
23-07-2024 BREAKING NEWS 08:55 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ వసతి గృహాలలో రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ లను నియమించాలి…- తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి.

ప్రభుత్వ వసతి గృహాలలో రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ లను నియమించాలి…- తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి.
IMG-20240723-WA0121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రభుత్వ వసతి గృహాలలో రెగ్యులర్ హాస్టల్ వార్డెలను నియమించాలని, నూతన భవనాలను ఏర్పాటు చేయాలని వెనుకబడిన తరగతుల జిల్లా అధికారి అనిల్ ప్రకాష్ కి వినతిపత్రం సమర్పించినట్లు తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలలో కనీస మౌలిక వసతులు లేవని రెగ్యులర్ వార్డెన్ లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు దుప్పట్లు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వసతి గృహాలు తనిఖీలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!