Social 1080×1350 • Multi-page
24-07-2024 BREAKING NEWS 03:24 AM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో మాచర్ల..

కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో మాచర్ల..
IMG-20240724-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు నామినేటేడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ప్రభుత్వం సీనియర్ నాయకులకు పదవులు అప్పగిస్తుండడంతో ఎవరికి వారె ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి, ఎమ్మేల్యేలపై నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్ లో మాచర్ల అంజయ్య ముందు ఉన్నారు. పార్టీ అధిష్టానంతో పాటు ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అంజయ్య పేరును సూచిస్తున్నారు. తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీకి చెందిన మాచర్ల అంజయ్య గౌడ్ గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం గౌడ సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా రోజులలో కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉండి కూడా ఎలాంటి పదవులు రాకున్నా పార్టీలోనే కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్యపాత్ర పోషించి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన పార్టీనే నమ్ముకొని అందులోనే కొనసాగుతూ పార్టీ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన ఆకార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా పనిచేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఆర్థికంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. బీసి సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనేక బీసీ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, ముఖ్య అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యపాత్ర పోషించాడు. కావున కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాచర్ల అంజయ్య గౌడ్ ను వరించే అవకాశం ఉందని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!