Social 1080×1350 • Multi-page
25-07-2024 BREAKING NEWS 01:27 AM
swarnodayam.com
Telugu Daily News

పశువులతో ప్రజలు పరేషాన్..పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీసు యంత్రాంగం..తగిన చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి డిమాండ్.

పశువులతో ప్రజలు పరేషాన్..పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీసు యంత్రాంగం..తగిన చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి డిమాండ్.
IMG-20240725-WA0625

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జమ్మికుంట పట్టణ రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్న పశువులతో వాహనదారులు మరియు పట్టణ ప్రజలు పరేషాన్ అవుతున్నారని జమ్మికుంటకు చెందిన సీనియర్ సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు.
ప్రధానంగా గాంధీ చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్ రోడ్ లలో పశువులు గుంపులు గుంపులుగా తిష్ట వేసుకుని ఉండి ట్రాఫిక్ కు ఇబ్బందులు కల్పిస్తూ వాహనదారుల ప్రమాదాలకు కారణం అవుతూ ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలంలో ప్రమాదం బారిన పడకుండా వాహనదారులే వాటిని పక్కకు తరలించి ప్రాయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ సిబ్బంది కానీ ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీస్ సిబ్బంది కానీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా బదులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూన్నానన్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశువులను గోశాలకు తరలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కమిషనర్ కు, పట్టణ పోలీసులను సాబీర్ అలీ డిమాండ్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!