Social 1080×1350 • Multi-page
25-07-2024 BREAKING NEWS 07:01 AM
swarnodayam.com
Telugu Daily News

ఏసీబీ దాడుల్లో ఇద్దరు అధికారుల పట్టివేత!

ఏసీబీ దాడుల్లో ఇద్దరు అధికారుల పట్టివేత!
IMG-20240725-WA0681

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ..! పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అధికారులు తెలిపిన వివరాలు.. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డికి మహిళ ఈ విషయం చెప్పింది. దీంతో న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకున్నారు…

పరకాలలో ఏసీబీ ట్రాప్: పరకాల పట్టణంలో రూ . 80000 లంచం తీసుకొంటూ సబ్ రిజిస్టర్ సునీత రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడు లాడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481c సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా రూ .80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత. దీంతో ఏసీబీని బాధితులు ఆశ్రయించగా నగదు అందజేస్తుండగా రెడ్ హండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు అధికారులు ఉన్నత స్థానంలో ఉండి లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరకడం సంచలనం కలిగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు లంచాలకు స్వస్తి పలికి నిజాయితీగా విధులు నిర్వహించి ప్రజల మెప్పు పొందాలని పలువురు సూచిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!