Social 1080×1350 • Multi-page
25-07-2024 BREAKING NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News

బడ్జెట్లో కరీంనగర్ కిచ్చింది “0”.. గాడిద గుడ్డు…!తెలంగాణ చౌక్ లో బిజెపి నిరసన… -బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు

బడ్జెట్లో కరీంనగర్ కిచ్చింది “0”.. గాడిద గుడ్డు…!తెలంగాణ చౌక్ లో బిజెపి నిరసన… -బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు
IMG-20240725-WA0695

-బడ్జెట్ అంతా అంకేల గారడి.. మాయమాటలు… మొక్కుబడి కేటాయింపులు…

-సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 4000 వేల కోట్లు కేటాయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మిగతా నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు..?

-తెలంగాణ చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కరీంనగర్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ బిజెపి జిల్లా శాఖ గురువారం సాయంత్రం తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిలా కనిపిస్తుందన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ మొక్కుబడి కేటాయింపులు , మాయమాటల్లా ఉన్నాయన్నారు. లోగడ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వివిధ రంగాలకు భారీ నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పలికి నేడు అధికారంలోకి వచ్చాక మొక్కుబడి కేటాయింపులు జరిపిందన్నారు. అలాగే నియోజకవర్గాల,జిల్లాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 4200 కోట్ల పైచిలుకు నిధులు అభివృద్ధి పనులకు కేటాయించుకుంటే, కరీంనగర్ జిల్లాలోని ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఆ విధంగా ఎందుకు నిధులు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది పూర్తిగా వివక్ష చూపడమేనని, బడ్జెట్లో కూడా కరీంనగర్ జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించకుండా చిన్నచూపు చూశారన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని అందుకే జిల్లాకు బడ్జెట్లో “0”నిధులను, గాడిదగుడ్డు తీసుకువచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కళ్లెం వాసుదేవ రెడ్డి, రాపర్తి ప్రసాద్, బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్, దురుశెట్టి సంపత్, ఎన్నం ప్రకాష్ , ఎడమ సత్యనారాయణ, అలివేలు సమ్మిరెడ్డి, జానపట్ల స్వామి, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, దుర్శెట్టి అనూప్, పెద్దపెల్లి జితేందర్. బండ రమణారెడ్డి , నాంపల్లి శ్రీనివాస్, గౌతమ్ రెడ్డి, అనిల్, సమీ పర్వేజ్, ఉప్పరపల్లి శ్రీనివాస్ , ఈసంపల్లి మహేష్, మాసం గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!