Social 1080×1350 • Multi-page
25-07-2024 BREAKING NEWS 10:24 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి.

హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని గురువారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీ చేసారు. ఏసీపీ కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్షించి, వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన నూతన చట్టాల అమలు జరిగేలా చూడాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా డివిజన్ పరిధి పోలీస్ స్టేషన్ లోని అధికారుల ద్వారా ప్రజల్లో అవగాహనా పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం మొదలగు వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!