25-07-2024 NORMAL NEWS 12:05 PM
swarnodayam.com
Telugu Daily News
25-07-2024 12:05 PM By Mandala Yadagiri

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురి అరెస్ట్.. గంజాయి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవు…ఏసిపి నాగేందర్ గౌడ్

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురి అరెస్ట్.. గంజాయి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవు…ఏసిపి నాగేందర్ గౌడ్
IMG-20240725-WA0721

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, అదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డిఎస్పీ సిహెచ్ నాగేందర్ గౌడ్ తెలిపారు. ఉట్నూర్ లో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్సై మనోహార్ తన సిబ్బందితో కలిసి ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారి వద్ద ఉన్న బ్యాగులు పరిశీలించగా అందులో 4 కిలోల 82 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి విక్రయించిన రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఉట్నూర్ డివిజన్ లో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీతోపాటు సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!