Social 1080×1350 • Multi-page
26-07-2024 BREAKING NEWS 10:41 AM
swarnodayam.com
Telugu Daily News

ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
IMG_20240726_213806

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్ పీటర్, ఎం.సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!