28-07-2024 NORMAL NEWS 11:00 AM
swarnodayam.com
Telugu Daily News
28-07-2024 11:00 AM By Mandala Yadagiri

ప్రజాకవి డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి సేవ రత్న అవార్డ్ ప్రధానం.

ప్రజాకవి డాక్టర్ సత్యంగౌడ్ కు జాతీయస్థాయి సేవ రత్న అవార్డ్ ప్రధానం.
IMG_20240728_215757

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి సేవ రత్న అవార్డ్ ను ఫిఫ్త్ ఈవెంట్ ను పురస్కరించుకొని జాతీయస్థాయి మెగా ఎంటర్ప్రైజెస్ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు సామాజికవేత్త పి.శిరీషరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, యాక్టర్ అండ్ యాంకర్ భార్గవ్, డైరెక్టర్ టి రుద్ర శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ అనుప్రసాద్, సామాజికవేత్తలు వేణుగోపాల్, విజయభాస్కర్, ఉమెన్ రైట్స్ సోషల్ సర్వీస్ చైర్మన్ అరుణ, ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అమృత్, జెమినీ సురేష్, శ్యాంసుందర్, వివిధ సంస్థల అధ్యక్షులు సత్యగౌడ్ సామాజిక సేవలు, వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి వీరిని జాతీయస్థాయి సేవ రత్న అవార్డుకు ఎంపిక చేసి, ఈ అవార్డును హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ మీటింగ్ హాల్లో ఆదివారం రోజున సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, జ్ఞాపకను అందజేసి, గురు కిరీటాన్ని గోల్డ్ మెడల్ ను దరింపజేసి, సేవ రత్న అవార్డుతో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షరాలు పి శిరీష రెడ్డి, ముఖ్య అతిథులు సత్యంగౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షురాలు శిరీషరెడ్డితో పాటు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. సత్యంగౌడ్ సామాజిక సేవలు, వారి సామాజిక రచనలు, ఆధ్యాత్మిక బోధనలు ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోరుతూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదిగి, చదువుతో పాటు, సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న మానవతా విలువలు పెంపొందించుకోవాలి అనే పలు ప్రధాన అంశాల మీద సెమినార్లు ఇస్తున్న సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం సత్యంగాడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. స్వలాభం సంతృప్తి ప్రధానం కాదని, సాటి మనిషి మేలుకోరడంలోనే మానవత్వం దాగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారులు, ప్రముఖలు ప్రజా ప్రతినిధులు, సినీ, మరియు టివి నటులు, విద్యావేత్తలు, భక్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, కళాకారులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!