28-07-2024 NORMAL NEWS 01:07 PM
swarnodayam.com
Telugu Daily News
28-07-2024 01:07 PM By Mandala Yadagiri

పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్!

పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్!
1000036265

స్వర్నోదయము ప్రతినిధి:హైదరాబాద్2024, మనుభాకర్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ మనుభాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మనుభాకర్‌‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ‘పారిస్ ఒలింపిక్స్‌-2024లో భాగంగా దేశం తరఫున మొదటి పతకాన్ని గెలుచుకున్నారు. కాంస్య పతకాన్ని సాధించినందుకు అభినందనలు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కి ఈ విజయం మరింత ప్రత్యేకం, అపురూపమైన విజయం! అంటూ ట్వీట్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!