Social 1080×1350 • Multi-page
28-07-2024 BREAKING NEWS 11:54 PM
swarnodayam.com
Telugu Daily News

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి, గోదావరిఖని జులై 29: అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం గోదావరిఖనిలో సిల్వర్ జూబ్లీ (1999-2000) వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయులు సర్వోత్తమ రెడ్డి, భాగ్యలక్ష్మిలను విద్యార్తిని, విద్యార్థులు శల్వాతో ఘనంగా సన్మానించి మెమెంటోలను బహూకరించి పూల మాలలతో సత్కరించారు. ఆనంతరం విద్యార్థులు చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, ఆత్మీయంగా పలకరించు కున్నారు. ఈ మేరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలు కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ కార్యక్రమములో పుల్లి శ్రీనివాస్ రెడ్డి, నక్క నరేష్, శ్రీమన్నారాయణ, అవుల సారయ్య, జే సతీష్, ఉయ్యాల కుమారస్వామి, సంతోష్, రమేష్, రఘురాం, రవీందర్ రెడ్డి, కమలాకర్, డీ రమాదేవి, సరిత, ఎన్ రమాదేవి, సమత, స్వప్న, పుష్పలత, స్వరూపరాణి, అరుణ, శ్రీలత, మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!