Social 1080×1350 • Multi-page
29-07-2024 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు!. -సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్.

నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు!. -సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్.
IMG_20240730_105517

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను, కార్మిక నాయకులను ముందస్తుగా జమ్మికుంట పోలీస్ లు అరెస్టులు చేయడం సరికాదని, నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అనేక సంవత్సరాల తరబడి పని చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ అందరిని సహాయ కార్యదర్శిగా నియమించాలి, కార్మికులందరినీ, పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కార సాధనకై ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం తరలి వెళ్తున్న సందర్భంలో, ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం ఈ మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పినట్లు వాటిని పరిష్కారం చేయాలని అన్నారు. గత ఆరు నెలలుగా పంచాయతీరాజ్ మంత్రి అయిన సీతక్కని, కమిషనర్ ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో రాష్ట్ర యూనియన్ పోరాటానికి పిలుపునిచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే మరో సమ్మె, పోరాటానికి కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా అరెస్టు అయిన అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి యూనియన్ మండల ఉపాధ్యక్షులు మ్యాకమల్ల రాము, కారోబార్ మండల అధ్యక్షులు రాచాపల్లి స్వామి, నాయకులు అంబాల సదానందం, అప్పల ప్రవీణ్, లద్దునూరి కుమార్, గరిగంటి రవి, జైపాల్, పురుషోత్తం, అశోక్, రమేష్, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!