30-07-2024 NORMAL NEWS 04:39 AM
swarnodayam.com
Telugu Daily News
30-07-2024 04:39 AM By Mandala Yadagiri

సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ

సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ
IMG-20240730-WA0099

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:


ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు పల్లె పల్లెలో దండోరా జెండా ఆవిష్కరణ లో భాగంగా మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాదిగ జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఇంజo వెంకటస్వామి హుజురాబాద్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రొంటాల రాజ్ కుమార్ పాల్గొన్నారు.
అదే విధంగా తుమ్మనపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో రుద్రారపు రామచంద్రం మాదిగ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైన పోరాటం గత 30 సంవత్సరాల నుండి జరుగుతుందని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునందుకొని కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ డివిజన్ లో నిరంతర పోరాటం జరుగుతుందని మాదిగ, ఉప కులాలకు న్యాయమైన వాటా దక్కటం కోసం పోరాటంలో భాగంగా హుజురాబాద్ మండలం లో ప్రతి గ్రామంలో మాదిగ దండోరా ఆవిష్కరణ జరుగుతుందని వివరించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వర్గీకరణ చేస్తామని మాదిగల విశ్వరూప మహాసభలో లక్షలాది ఉంది మాదిగల సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మాదిగ మరియు ఉప కులాల ప్రజలకు న్యాయం చేయాలని విన్నవించారు.
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగాపూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కలవల సంపత్ , కలవల వీరస్వామి , ఎలబోతారం మాజీ సర్పంచ్ నమిండ్ల రవీందర్ ,కలవల మల్లయ్య , నమిండ్ల రాజేశ్వరరావు ,జీడి రవితేజ , కదిరే రమేష్, దాట్ల ప్రవీణ్ మరియు తుమ్మనపల్లి గ్రామం లో మాoదాడిపల్లి మాజీ సర్పంచ్ ఆరేపల్లి ఎల్లయ్య , మిడిదొడ్డి సురేష్, మిడిదొడ్డి శ్రీనివాస్, మిడిదొడ్డి సుధాకర్, మిడిదొడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!