30-07-2024 NORMAL NEWS 08:46 AM
swarnodayam.com
Telugu Daily News
30-07-2024 08:46 AM By Mandala Yadagiri

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. టియు డబ్ల్యుజే ఐజేయు జిల్లా మాజీ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. టియు డబ్ల్యుజే ఐజేయు జిల్లా మాజీ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్
Oplus_131072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు కృషి చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని ఆ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎలగందుల రవిలు పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని విశేష కన్వేన్షన్ హాల్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హుజూరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలు సకాలంలో పరిష్కారించేందుకు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి జర్నలిస్టుకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అండగా ఉంటుందన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మహేంద్రచారి, కోరం సుధాకర్ రెడ్డి, తిరుణహరి ఆంజనేయులు, కాయిత రాములు, కే మల్లారెడ్డి, మామిడి రవీందర్ గౌడ్, అల్లి నరేందర్, కే నర్సింహారెడ్డి, పి తిరుపతి, ఎండీ మక్సుద్, ముక్కెర రాజు, ఎన్ సాయికృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!