Social 1080×1350 • Multi-page
30-07-2024 BREAKING NEWS 10:51 AM
swarnodayam.com
Telugu Daily News

బాధితునికి నగదు రూ రెండు లక్షల అందజేసిన ఏసిపి శ్రీనివాస్ జి

బాధితునికి నగదు రూ రెండు లక్షల అందజేసిన ఏసిపి శ్రీనివాస్ జి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 24న AP.15.Z.0155 అనే నంబర్ గల ఆర్టీసీ బస్సు పరకాల నుండి హుజురాబాద్ కు రాగ అందులో ప్రయాణిస్తున్న విలసాగరం ప్రమోద్, మొర ఉదయ్ కుమార్ అనే ఇద్దరు యువకులు రెండు లక్షలు రూపాయలను కలిగిన బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి బస్సులోనే మరిచిపోయినట్లు గుర్తించారు. ఆ డబ్బులను వెంటనే హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇద్దరు ప్రయాణికులు పొలుస్ లకు అప్పగించారు. ఆ డబ్బులు బాధితునికి అప్పగించాలనే ఉద్దేశంతో హుజురాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా సమాచారంను బాధితులకు తెలిసేటట్లు చేసి పోగొట్టుకున్న బాధితులను సరియైన ఆధారాలతో రమ్మని తెలిపారు. దీంతో ఈరోజు హుజురాబాద్ ACP శ్రీనివాస్ జి, హుజురాబాద్ టౌన్ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ, ఇతర సిబ్బంది సమక్షంలో ఆ డబ్బులను నిజమైన బాధితుడైన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన మేకల రాజయ్య బస్సులో మర్చిపోయిన రూ. రెండు లక్షలు తనవేనని తగిన ఆధారాలతో వచ్చాడు. అతని డబ్బు గురించి పూర్తి విచారణ జరిపి విచారణలో అతనివేనని తెలవడంతో ఎసిపి శ్రీనివాస్ జి బాధితుడు రాజయ్యకు రెండు లక్షలు రూపాయలను తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అప్పగించారు. ఎంతో నిజాయితీగా డబ్బులు దొరకగానే అందించిన సదరు యువకులను పోలీసులు అభినందించగా సమగ్ర విచారణ జరిపి నిజమైన బాధితునికి రెండు లక్షల రూపాయలు తిరిగి అందజేసినందుకు బాధితుడు మేకల రాజయ్య మరియు అతని బంధువులు హుజురాబాద్ పోలీసులకి కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!