Social 1080×1350 • Multi-page
31-07-2024 BREAKING NEWS 02:49 AM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణంకు సంబంధించి కావాలని కొందరు దుష్ప్రచారం!శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ

ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణంకు సంబంధించి కావాలని కొందరు దుష్ప్రచారం!శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
IMG-20240727-WA0070

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆర్టీసి బస్సుల్లో మహిళల ప్రయాణంకు సంబంధించి కావాలని కొందరు కొన్ని వీడియోలు తీసి వారి పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయని, వాటిని విచారించాలని రవాణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం శాసనసభ సమావేశాల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఊరికే వెళ్లిపాయాలు తీసుకుంటు వెళ్తున్నారని వీడియోలు వచ్చాయన్నారు. రవాణా శాఖ మంత్రిగా డిసెంబర్ 9 నుండి మహిళకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యంపై స్కీమ్ సక్సెస్ అయిందని మొదటి నుండి కల్ల మంట జరుగుతుందన్నారు. ఆటో కార్మికుల పేరు మీద మాట తెస్తున్నారు..మీకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టమా లేదా…? వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు..అని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి తెలిపారు. మహిళను అవమాన పరిచే విధంగా ఏం పని లేక తిరుగుతున్నారనీ అవహేళనగా వస్తున్న వీడియోల మీద చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.

మెట్రో వచ్చిన తరువాత 5 లక్షల మంది ప్రయాణికులు వెళ్తున్నారన్నారు. అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా…? ఓల, ఉబర్ వాళ్ళు మొదలైన తరువాత ప్రభావం పడలేదా..? ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడుతుందని.. ఆ ప్రభావం పడకుండా సూచనలు చేయాలని.. అవహేళన మీద వీడియోలు ఎవరు సృష్టిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు.. షూటింగ్ లు చేసి పెట్టే వీడియోలా పై చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!