31-07-2024 NORMAL NEWS 05:27 AM
swarnodayam.com
Telugu Daily News
31-07-2024 05:27 AM By Mandala Yadagiri

నూతన గవర్నర్ కి సీఎం, సిఎస్, ఇతర అధికారుల ఘన స్వాగతం

నూతన గవర్నర్ కి సీఎం, సిఎస్, ఇతర అధికారుల ఘన స్వాగతం
IMG_20240731_162500

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మకి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే సీఎం తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!