Social 1080×1350 • Multi-page
31-07-2024 BREAKING NEWS 05:54 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ఆర్టీసీ కండక్టర్ వేల్పుల ప్రభాకర్ ఉద్యోగ విరమణ

ఘనంగా ఆర్టీసీ కండక్టర్ వేల్పుల ప్రభాకర్ ఉద్యోగ విరమణ
IMG_20240731_164833

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన వేల్పుల ప్రభాకర్ దంపతులను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన వేల్పుల ప్రభాకర్ పేద దళిత కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని 1994 మార్చిలో ఏపీఎస్ ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగంలో చేరారు. స్వతహాగా సామాజిక సమస్యల పట్ల స్పందించే ప్రభాకర్ ఆర్టీసీ యూనియన్ లో సభ్యునిగా తోటి కార్మిక సంఘంలో చురుకుగా పనిచేసీ కార్మిక సమస్యల పైన నిత్యం పోరాడారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆర్టీసీ కార్మికులను ఏకం చేసి ఉద్యమంలో చురుకుగా పాల్గొని హుజురాబాద్ ఆర్టీసీ యూనియన్ కు రాష్ట్రంలోనే గుర్తింపును తీసుకొచ్చారు. సమాజంలో దళిత బహుజన ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. 30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి నేడు జూలై 31న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు, స్నేహితులు ఘనంగా ప్రభాకర్ దంపతులను సన్మానించారు. సన్మానించిన వారిలో బాబు జగజీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, ఎంఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, పీవీ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులైన సైదాపూర్ మాజీ ఎంపీపీ పోడిశెట్టి వెంకటరాజం, భీమోజు సదానందం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సీనియర్ రిపోర్టర్ కేసిరెడ్డి నరసింహారెడ్డి, మరియు కేసరి మధుకర్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వేల్పుల విజయ్ కుమార్, ఎర్ర కుమార్, ప్రజా సంఘాల నాయకులు బత్తుల రాజలింగం, ఆర్టీసీ ఉద్యోగి మొలుగూరి కొమరయ్య, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి బొడిగ మల్లయ్య , టీచర్ జూపాక వీరస్వామి, కుడికాల ప్రభాకర్, మొలుగు శ్రీధర్ లతోపాటు, వేల్పుల ప్రభాకర్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, మిడిదోడ్డి శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, గంట కిరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!