Social 1080×1350 • Multi-page
31-07-2024 BREAKING NEWS 09:39 AM
swarnodayam.com
Telugu Daily News

యునైటెడ్ ఫోరంఫర్ ఆర్టిఐ హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గా రావుల రాజేశం ఎన్నిక

యునైటెడ్ ఫోరంఫర్ ఆర్టిఐ హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గా రావుల రాజేశం ఎన్నిక
IMG-20240731-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రముఖ కవి, రచయిత, సామాజికవేత్త రావుల రాజేశంను యునైటెడ్ ఫోరం హుజూరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గా నియమించారు. ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన రావుల రాజేశం
సమాచార చట్టం(రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్) భారతీయుడి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని యునైటెడ్ ఫోరంఫర్ ఆర్.టి.ఐ కాంపెయిన్ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు గూడూరి స్వామిరెడ్డి (లోక్ సత్తా),ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ కాంపెయిన్ తెలంగాణ కన్వీనర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ కమిటీ ఎన్నికలు మంగళవారం రోజు జరిగాయి. జమ్మికుంట చాణక్య డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రావుల రాజేశంను జమ్మికుంట మండల కన్వీనర్ పోరండ్ల శ్రీనివాస్, కో కన్వీనర్ చందా మహేందర్ ను, ఇల్లందకుంట మండల కన్వీనర్ మూల శ్రీనివాస్ ను నియమించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు గూడూరి స్వామిరెడ్డి (లోక్ సత్తా), ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి నియామక పత్రాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు, కమిటి సభ్యులు ఎలకంటి రమణాచారి, నరిగే రవీందర్, ఎండి రఫీ, గూడూరి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!