Social 1080×1350 • Multi-page
01-08-2024 BREAKING NEWS 04:11 AM
swarnodayam.com
Telugu Daily News

మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం
IMG_20240801_150636

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్, గందే రాధిక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీలో మహిళ అని చూడకుండా సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏజెండాగా పెట్టుకుందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మాట్లాడనివ్వకుండా చేసేందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆగమయితుందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను ఎక్కడైతే అవమానించారో అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంఘం ఐలయ్య, సోషల్ మీడియా రాష్ట్ర నాయకురాలు గోడిశాల పావని గౌడ్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యంరాజు, కేసిరెడ్డి లావణ్య, మక్కపల్లి కుమార్, ముక్క రమేష్, కల్లేపల్లి రమదేవి, మారపెల్లి సుశీల, ఎండి ఇమ్రాన్, ప్రతాప కృష్ణతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!