01-08-2024 NORMAL NEWS 08:36 AM
swarnodayam.com
Telugu Daily News
01-08-2024 08:36 AM By Mandala Yadagiri

హుజురాబాద్ లో ఎస్సీ వర్గీకరణ తీర్పు పై హర్షం

హుజురాబాద్ లో ఎస్సీ వర్గీకరణ తీర్పు పై హర్షం
IMG_20240801_193140

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:


ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ న్యాయ సమ్మతమని గురువారం సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన సందర్భంగా హుజురాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా దగ్గర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఫాలాభిషేకం చేసిన అనంతరం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదిగల చిరకాల కోరికైనా షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్పిస్తూ రాష్ట్రాలకు అధికారాన్ని అప్పగించడం చారిత్రాత్మక విజయమని హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్సీల్లోని అన్ని కులాల వారికి సమాన న్యాయం దక్కుతుందని వివరించారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా మాదిగ జాతి అభివృద్ధికి దోహదపడే వర్గీకరణ కోసం నిరంతరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. ఉద్యమంలో అమరులైన మాదిగ వీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. అనంతరం పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు, కళాకారులు పాటల ద్వారా అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, మారేపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, పీవీ హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకట రాజం, వేల్పుల ప్రభాకర్, రాం రాజేశ్వర్, కనకం వెంకటస్వామి, మోరే సతీష్, బొడ్డు ఐలయ్య, కలవల మల్లయ్య, బొడిగ మల్లయ్య, బత్తుల రాజలింగం, తునికి సమ్మయ్య, రొంటాల సుమన్, ఎర్ర శ్రీనివాస్, మిడిదొడ్డి శ్రీనివాస్, ఎర్ర శ్రీధర్, రొంటాల రాజ్ కుమార్, కలవల సంపత్, రాం సారయ్య, మొలుగూరి మొగిలయ్య , రాచపల్లి ఎల్లయ్య, బత్తుల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

– మందకృష్ణ మాదిగకి పోరాటంలో గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాట ఫలితంగా సుప్రీంకోర్టులో నేడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల మందకృష్ణకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ గాంధీనగర్ సాహుయుత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో పాలాభిషేకం చేసి మందకృష్ణ మాదిగకి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్ రొంటాల రాజకుమార్, తుమ్మనపల్లి విలేజ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది.

నెరవేరిన మాదిగల కల
——–////————-
మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా చేసిన అలుపెరుగని పోరాటాలు నేడు సుప్రీంకోర్టు తీర్పుతో 59 మాదిగ ఉపకులాలలో హర్షాతి రేఖలు వెలిబుచ్చుతున్నారు. 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో రిజర్వేషన్ ఫలాలు 59 మాదిగ ఉపకులాలకు సమానంగా దక్కాలని ఏడుగురుతో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటం చేసి అనేక విజయాలు సాధించి ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో మాదిగల్లో చైతన్యం నింపిన మందకృష్ణ మాదిగ చేసిన అలుపెరుగని పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం DBSA,DMSA, dream drum, బహుజన యాది సభ సంఘాల వ్యవస్థాపకులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ మరియు ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు రామచ భరత్ అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందక విద్యకు ఉద్యోగాలకు రాజకీయ రంగాలకు దూరమై ఒక్క తరం నష్టపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలైన ఎస్సీ వర్గీకరణతో దాదాపు 22 వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కాయని అదే విధంగా అనేక రంగాలలో లబ్ధి పొందారని వారు గుర్తు చేస్తూ వర్గీకరణను అమలు చేసిన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దూర దృష్టితో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిందన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన దానిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ అమలయ్యేలా చూడాలని అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అనుసరించి ఇటీవలే ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లలో ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి ఎస్సి ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని కవులు రచయితలు గాయకులు ఇంటలెక్చువల్ మేధావులు, కళా సంఘాలు రచయితల సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రత్మకమైన తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

oplus_0

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!