Social 1080×1350 • Multi-page
01-08-2024 BREAKING NEWS 10:13 AM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పట్ల న్యాయవాదుల హర్షం..! హుజురాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పట్ల న్యాయవాదుల హర్షం..! హుజురాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి
IMG-20240801-WA0240

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సుప్రీం కోర్ట్ ఇఛ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఎస్సి వర్గీకరణ అమలు చేయలనీ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడం పట్ల హుజురాబాద్ బారా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి దళిత న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ పట్ల సానుకూల స్పందన వచ్చేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు. వర్గీకరణ అమలు చేస్తే ఎస్సి ఉపకులాలకు రిజర్వేషన్ అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ముప్పై ఏండ్ల ఘన చరిత్ర కలిగి ఎన్నో బాధలు, ఎన్నెన్నో అవమానాలకు ఓర్చి లక్ష్యం చేరేవరకు పోరాటం చేసిన అలుపెరుగని ఉద్యమ పటిమ గల మందకృష్ణన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దళిత న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది బాణాల శ్యాంసుందర్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎర్రోళ్ల రమేష్, బత్తుల తిరుపతి, ములుగు కొండయ్య, మొలుగూరి విక్రమ్, కలకోటి శ్రవణ్, జీడి రవితేజ, మోరే కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!