Social 1080×1350 • Multi-page
02-08-2024 BREAKING NEWS 06:09 AM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సి వర్గీకరణ సబబెనన్న అత్యున్నత న్యాయస్థానం

ఎస్సి వర్గీకరణ సబబెనన్న అత్యున్నత న్యాయస్థానం
IMG-20240802-WA0094

మండల యాదగిరి, స్వర్నోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో మట్టేల తిరుపతి జనరల్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ఎస్సి వర్గీకరణ అమలు సమావేశంలో డా: బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, పలువురు మాదిగ న్యాయవాదులు తమ తమ అభిప్రాయాలు తెలియజేసి, హర్షం వ్యక్తం చేశారు. ముప్పై యేండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ అమలయ్యెంత వరకు కృషి చేసిన మందకృష్ణన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సి ఉపకులాలు లబ్ది పొంది తమ జీవితల్లో వెలుగులు నిండాలని కోరారు. ఎస్సి వర్గీకరణకు సహకరించిన ప్రతి ఉద్యమకారునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోలుగురి సదయ్య, ఎర్రోళ్ల రమేష్ , కనకం దేవయ్య, బత్తుల తిరుపతి, మోలుగిరి విక్రమ్, అందే శ్రీనివాసరావు, మోరె కళ్యాణ్, కుమారసమి, సౌమిత్ర, బాణాల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!