02-08-2024 NORMAL NEWS 06:41 AM
swarnodayam.com
Telugu Daily News
02-08-2024 06:41 AM By Mandala Yadagiri

మంత్రి పొన్నం ప్రభాకర్ కి నిధుల మంజూరుకి ఎమ్మెల్యే వినతి

మంత్రి పొన్నం ప్రభాకర్ కి నిధుల మంజూరుకి ఎమ్మెల్యే వినతి
IMG-20240802-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్, బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ . 2 కోట్ల రూపాయల నిధులు వెంటనే మంజూరి చేయాల్సిందిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మంత్రి ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. తరచూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి చాంబర్ కు వెళ్లి స్వయంగా కలిసి ముచ్చటించి నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం వెతిపత్రం ఇవ్వడంతో హుజురాబాద్ ప్రాంతంలో చర్చనీయంగా మారింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!