Social 1080×1350 • Multi-page
02-08-2024 BREAKING NEWS 07:08 AM
swarnodayam.com
Telugu Daily News

కుల గణన చేసి వర్గీకరణ అమలు చేయాలి… -ఎస్సి ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణు.

కుల గణన చేసి వర్గీకరణ అమలు చేయాలి… -ఎస్సి ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణు.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ఎస్సీ కులాలను కుల గణన చేసిన అనంతరమే వర్గీకరణ అమలు చేయాలని ఎస్సీ ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లడుతూ.. ఎస్సీ ఉప కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 30 లక్షల వరకు ఉంటారని , ప్రస్తుత జనాభా రెట్టింపు అవుతుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎస్సీ కులాల ను వర్గీకరణ చేస్తే ఉపకులాలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్సి వర్గీకరణ పలాలు ఉప కులాలకు అందాలంటే తక్షణమే కుల గణన చేయాలని కోరారు. అలాగే అంబేద్కర్ అభయాస్తంలో భాగంగా ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించి ఉప కులాల కార్పొరేషన్ ను విస్మరించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా బైరి వెంకటేశంను నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కానుకూర్తి రాజేష్, తూర్పాటి లింగయ్య, చింతల అంజి, చింతల సతీష్ వర్మ, చంద్రగిరి సందీప్, తూర్పాటి రాజు, తూర్పాటి రామచంద్రం, రేవెల్లి వెంకటేష్ , వానరాశి జాన్, తూర్పాటి సాయికుమార్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!