Social 1080×1350 • Multi-page
02-08-2024 BREAKING NEWS 09:24 AM
swarnodayam.com
Telugu Daily News

ఒకే రోజు ముగ్గురు అధికారుల పదవీ బాధ్యతల స్వీకరణ!

ఒకే రోజు ముగ్గురు అధికారుల పదవీ బాధ్యతల స్వీకరణ!
IMG_20240802_201123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఒకే రోజు ముగ్గురు అధికారులు పదవీ బాధ్యతలు స్వీకరించడం యాదృచ్ఛికంగా జరిగింది. మండల స్థాయి అధికారులే గాక కీలకమైన శాఖలకు వీరు ముగ్గురు అధికారులుగా వ్యవహరించడం గమనార్హం. ఇందులో ఒకరు తాసిల్దార్, మరొకరు టౌన్ సిఐ, ఇంకొకరు సబ్ రిజిస్టార్ కలరు.

–హుజురాబాద్ తాసిల్దారుగా కనకయ్య:

హుజురాబాద్ మండల తాసిల్దార్ గా కే కనకయ్య శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ తాసిల్దార్ గా ఉన్న కే విజయ్ కుమార్ తిమ్మాపూర్ కు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న కనకయ్య హుజురాబాద్ కు వచ్చారు.

–హుజురాబాద్ సిఐగా తిరుమల్ :

హుజురాబాద్ టౌన్ సిఐగా జి తిరుమల్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ టౌన్ సిఐగా పనిచేసిన బొల్లం రమేష్ కరీంనగర్ సిసిఎస్ కు బదిలీ కాగా కరీంనగర్ సిఎస్ బి త్రీ లో పనిచేస్తున్న తిరుమల్ హుజురాబాద్ కు బదిలీపై వచ్చారు.

–సబ్ రిజిస్టర్ గా ఇంత్యాజుద్దీన్ :

హుజురాబాద్ సబ్ రిజిస్టర్ గా ఎండీ ఇంతియాజుద్దీన్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ లో పని చేసిన ఎండీ మక్సూద్ అలీ అదిలాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో ఈయన చార్జ్ తీసుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!