Social 1080×1350 • Multi-page
02-08-2024 BREAKING NEWS 10:54 AM
swarnodayam.com
Telugu Daily News

డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై సిఐ అవగాహన!

డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై సిఐ అవగాహన!
IMG_20240802_215256

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సిఐ తిరుమల్ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు మరియు వాహనదారులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ తిరుమల మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను వాహనదారులు, ఆటో డ్రైవర్లు, జీపు, కార్ డ్రైవర్లు దరిదాపుల్లోకి రాని వద్దన్నారు. ఒకసారి డ్రెస్ కు అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు. అలాగే విరివిగా సెల్ఫోన్ లను వాడుతూ వచ్చిన ప్రతి మెసేజ్ లను నొక్కినట్లయితే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లేనని సూచించారు. ఏదైనా సైబర్ నెరగాల ఉచ్చుకు చిక్కినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సైబర్ క్రై పోలీసులకు సమాచారం ఇస్తే పెద్దగా నష్టపోకుండా కాపాడుతారన్నారు. ప్రతి వాహనదారుడు వాహనాన్ని నడిపేడిపే ముందు రోడ్డు భద్రత గురించి కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వాహనదారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన వారి ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయన్న విషయాన్ని మరవకుండా జాగ్రత్తగా వాహనాలు నడపలన్నారు. ఆయన వెంట ఎస్సై, ఏఎస్ఐ, బ్లు కోల్ట్ పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు, ఇతర వాహనదారులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!