Social 1080×1350 • Multi-page
03-08-2024 BREAKING NEWS 08:36 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ హాయంలోనేనిరుద్యోగులకు న్యాయం..ఇచ్చిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ విడుదల..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు

కాంగ్రెస్ హాయంలోనేనిరుద్యోగులకు న్యాయం..ఇచ్చిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ విడుదల..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
IMG-20240803-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: పదేళ్ల పరిపాలన కాలంలో బిఆర్ఎస్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఉద్యోగాలు అసలు భర్తీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విడుదల చేసిందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిల్లరగా మాట్లాడడం తగదని, వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.

మీ హాయంలో ఒక్క ఉద్యోగము భర్తీ చేయలేధని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసిందనీ, ఉద్యోగాలు భర్తీ చేయడం అసలు మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు న్యాయం చేయడం మీకు నచ్చదా అని మండిపడ్డారు. మీ హాయంలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతిగా లేదని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించిందని పేర్కొన్నారు. మరో 13505 ఉద్యోగాల నియామకం చివరి దశలో ఉందని తెలిపారు.

గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం, వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల లీకు, పరీక్షల తేదీల ఓవర్ ల్యాప్ తో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు గ్రూప్ -1 పరీక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థతత వల్ల వాయిదా పడిందని తెలిపారు. 2023 మార్చి 17న పేపర్ లీకు వల్ల గ్రూప్ -1 పరీక్షను రద్దు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అసలు పరీక్షల నిర్వహణ కూడా సరిగా నిర్వహించలేకపోయిందని పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక బద్ధంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా జాబ్ క్యాలెండర్ ను రూపొందించిందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని విషయాన్ని జాబ్ క్యాలెండర్లో పొందుపరిచిందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!