Social 1080×1350 • Multi-page
03-08-2024 BREAKING NEWS 11:11 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా వి ఆంజనేయరావు..

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా వి ఆంజనేయరావు..
IMG-20240803-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా వి.ఆంజనేయరావు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఏ నిర్మల బదిలీ కావడంతో మానకొండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆంజనేయరావు ఇక్కడికి బదిలీపై వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆంజనేయరావు జిల్లా జేఏసిలోను, జిల్లా విద్యావంతుల వేదికలోను క్రియాశీలపాత్రను నిర్వహించారు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన శాస్త్రవేత్తలను, అధ్యాపకులను, ఉపాధ్యాయులను, సామాజిక ఉద్యమకారులను, రచయితలను, జర్నలిస్ట్ లను, క్రీడాకారులను, కళాకారులను,రాజకీయవేత్తలను,వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిఫుణులను గత 54 ఏళ్లుగా తీర్చిదిద్దిన చారిత్రాత్మకమైన హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవి బాధ్యతలను స్వీకరించిన ఆంజనేయరావుకి కళాశాల అధ్యాపకులు, మిత్రులు ఆయనకు పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. కళాశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల పురోభివృద్ధికి కృషిచేస్తారని పలువురు పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!