03-08-2024 NORMAL NEWS 12:56 PM
swarnodayam.com
Telugu Daily News
03-08-2024 12:56 PM By Mandala Yadagiri

హుజురాబాద్ కోర్టులను, సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జడ్జ్…బ్రహ్మాండంగా ఉన్న కోర్టు భవనాన్ని కాపాడుకుందాం.. -ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ప్రతిమ హితవు

హుజురాబాద్ కోర్టులను, సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జడ్జ్…బ్రహ్మాండంగా ఉన్న కోర్టు భవనాన్ని కాపాడుకుందాం.. -ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ప్రతిమ హితవు
IMG-20240803-WA0097


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : కోర్టు సముదాయ భవనం సకల సదుపాయాలతో బ్రహ్మాండంగా ఉందని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ప్రతిమ పేర్కొన్నారు. శనివారం ఆమె హుజురాబాద్ కోర్టును, స్థానిక సబ్ జైలును అకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారిపై నాలుగు కోర్టుల భవన సముదాయం చూపరులను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉందని దీనిని దెబ్బ దినకుండ కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులు సిబ్బంది పై ఉందన్నారు. భవనం పైన వర్షానికి నిలిచిన నీటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి మరమ్మతు చర్యలు తీసుకోవాలని R అండ్ B అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా సిబ్బంది పనులను పెండింగ్ ఉండకుండా చూడాలని, ఎలాంటి క్లిష్ట సమస్యలు లున్న తనకు సెకెండ్లలో తెలుపాలని వివరించారు. నాలుగు కోర్టులోని ఫైళ్లని తనిఖీ నిర్వహించారు. అనంతరం సబ్ జైలను సందర్శించి ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఖైదీలను జైలు సిబ్బందిని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జైలు ఆవరణ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ACB జడ్జ్ కుమార్ వివేక్, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేష్, జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ, కరీంనగర్ ఏఓ లక్ష్మి కాంత్, హుజురాబాద్ నాలుగు కోర్టుల సూపరెంటిండెంట్లు గోపినాథ్, మూర్తి, శంకర్, మధు, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సబ్ జైలర్, కోర్టు, జైలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!