05-08-2024 NORMAL NEWS 08:29 AM
swarnodayam.com
Telugu Daily News
05-08-2024 08:29 AM By Mandala Yadagiri

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.. -వీఎస్సార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రజిత

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.. -వీఎస్సార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రజిత
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం సింగపూరం గ్రామంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు సోమవారం ఓరియెంటెషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారపు రజిత మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థి దశలోనే కష్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుందన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిట్స్ కళాశాల రిజిస్టర్ డా”వి.రాజేశ్వర్ రావు మాట్లడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, సెల్ ఫోన్స్ మంచి కోసం ఉపయోగించలని విద్యార్థులకు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తాళ్లపల్లి అజయ్ కుమార్ , గాజుల శారదా, దుస గణేష్, పోతిరెడ్డి హరీష్, సతీష్, తిరుపతి, విజయ్, సదయ్య, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!