Social 1080×1350 • Multi-page
05-08-2024 BREAKING NEWS 10:37 AM
swarnodayam.com
Telugu Daily News

స్వచ్ఛధనం – పచ్చదనంలో ప్రతి ఒక్కరు భగస్వాములు కావాలి.. -విద్యార్థుల ర్యాలీ.. మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక

స్వచ్ఛధనం – పచ్చదనంలో ప్రతి ఒక్కరు భగస్వాములు కావాలి.. -విద్యార్థుల ర్యాలీ.. మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక
1000103687

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్వచ్ఛధనం – పచ్చదనంలో ప్రతి ఒక్కరు భగస్వాములు కావాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వార్డుల్లో ర్యాలీలు నిర్వహించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ.. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని, మన పరిసరాల్లో ఖాళీగా ఉన్న డ్రమ్ములు, టైర్లు, వాడి పాడేసిన కొబ్బరి బొండాలు ఇతర వస్తువులలో నీరు నిలవకుండా చూసుకోవాలని, నీరు నిలువ ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. నీరు నిలవ ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయని ఆమె తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాలలో పూల మొక్కలను ఇతర మొక్కలను నాటుకొని సంరక్షించాలని సూచించారు. ఆదేవిధముగా పట్టణములోని వివిధ ప్రాంతాలలో నీరు నిల్వ ఉన్న చోట ధోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమోపాస్ కెమికల్ ద్రావనమును అధికారులు దగ్గర ఉండి పిచికారి చేయించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వార్డు సభ్యులు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, కల్లేపల్లి రమాదేవి, బర్మావత్ యాదగిరి నాయక్, కమీషనర్ సల్వాది సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ కొలిపాక శ్రీనివాస్ మాజీ ఎంపీపీ కందుల ఆదిరెడ్డి, ఇంచార్జీ మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు , టౌన్ ప్లానింగ్ అధికారి బషీర్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వినీ గాంధీ, ఇంచార్జీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యండి రషీద్, సాయి, వినయ్, సానిటరీ జవాన్లు ప్రతాపరాజు, ఏ రమేష్, అనిల్, హెచ్ఎంలు శోభారాణి, తిరుమల, భారత ప్రభాకర్, ఉపాధ్యాయులు సంజీవయ్య, సొల్లు సారయ్య , స్వామిరావు, సమ్మయ్య, రాములు, కె.శోభారాణి, విష్ణు, గంగిశెట్టి రాజు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్.పిలు, ఆశా వర్కర్లు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!