Social 1080×1350 • Multi-page
06-08-2024 BREAKING NEWS 03:22 AM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కావ్యకు ఘన సన్మానం…..-అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)

జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కావ్యకు ఘన సన్మానం…..-అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)
IMG-20240806-WA0123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గ్లోబల్ చోటా కాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలలో జమ్మికుంట మారుతినగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినట్లు అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) తెలిపారు. జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్ లో 9 వ తరగతి చదువుకుంటూ గత 6 నెలలుగా కరాటే మాస్టర్ ఎస్కె జలీల్ వద్ద ప్రత్యేక శిక్షణ పొంది ఈ నెల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన గౌరు నారాయణరెడ్డి మోమోరియల్ మొదటి జాతీయస్థాయి కరాటే చాంపియన్ షిప్ ఈ నెల 4 న జరుగగా ఈ పోటీలలో 15 సం. విభాగంలో కటాస్ లో కావ్య అత్యుత్తమ ప్రతిభను కనబరచి బంగారు పతకం సాధించారన్నారు. కాగా మంగళవారం జమ్మికుంటకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) బంగారు పతకం కావ్య మేడలో వేసి శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ జన్ను కావ్య కరాటే పోటీలలో బంగారం పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని అభివర్ణించారు. అదే విధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ వందలాది మంది విద్యార్ధిని, విద్యార్థులను జాతీయ అంతర్జతీయ పోటీలలో ప్రతిభ కనబరిచే విధంగా తయారు చేస్తున్న హుజురాబాద్ కరాటే మాస్టర్ జలీల్ ను ప్రత్యేకంగా శాలువతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలు సాధించాలని కోరారు.
యువతి యువకులు చెడు వ్యసనాలకు దూరం ఉంటూ, కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లలో దృష్టి సాధిస్తూ మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహద పడతాయని అన్నారు. చదువుతోపాటు కరాటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లలో పాల్గొని తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుక రావడమే కాకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్న కలలను సాకారం చేయాలని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!