Social 1080×1350 • Multi-page
06-08-2024 BREAKING NEWS 08:52 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవం.

ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవం.
IMG_20240806_193052

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం హుజురాబాద్ లో పలుచోట్ల ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్యాలయంలో కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ గంధరాధికా, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ప్రభుత్వ కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు ప్రొ,,జయశంకర్ ఫోటో కు పూలమాలలతో అలంకరించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శనిగరపు శారద పూర్ణచందర్ తులసీదాస్ మురళీమోహన్, కళాశాల NSS ప్రోగ్రాం ఆపీసర్ సుగుణ, అధ్యాపక, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సింగపూర్ విఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ (NSS) ఆధ్వర్యంలో ప్రోపెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారపు రజిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గబ్బేటి తిరుపతి, ఎన్ఎస్ఎస్ కో- ఆర్డినెటర్ పోతిరెడ్డి హరీష్ , అధ్యాపకులు ,తాల్లపెళ్లి అజయ్, కున కోమల, శారద, సతీష్ బాస్కర్, సదయ్య, ఎన్ఎస్ఎస్ వాలెంటైఅర్స్ పాల్గొన్నారు.

ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులు అర్పించిన ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.
తెలంగాణా ఉద్యమ శిఖరం ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మంగళవారం కరీంనగర్ లో ఆయన విగ్రహానికి రైతు ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు నాయకుల తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతానికి ఆరు దశాబ్దాల పాటు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, స్వరాష్ట్ర సాధన కోసం అనునిత్యం పరితపించి తన జీవితాన్నే అంకితం చేసి మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్త గా, తెలంగాణా స్ఫూర్తి ప్రదాత గా నిలిచిన గొప్ప మహనీయులు ఆచార్య జయశంకర్ సారు అని పోలాడి రామారావు అభివర్ణించారు.

మనుమయ సంఘం ఆధ్వర్యంలో :

మనుమయ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి. మనమే సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమానులు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ సార్ అందించిన సేవలను కృషిని కొనియాడారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!