Telugu Daily News
కేరళలో వయనాడ్ బాధితుల కోసం సినీ హీరో ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు. మునుముందు మరికొందరు సినీ తారలు ముందుకు వచ్చి తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటారని కేరళ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


